27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం, మంత్రుల మీద నోరు పారేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు

Must read

📰 Generate e-Paper Clip

  • కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్

 

నిజామాబాద్, బతుకమ్మ :  కేసిఆర్ కుంభ కర్ణుడి నిద్రలేచి బయల్దేరాడని, సీఎంపైన, మంత్రుల మీద నోరు పారేసుకుంటే ఊరుకునే  ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో బుధవారం టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఫాం హౌస్ కి పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని, ఫామ్ హౌస్ లో పడుకున్న మీకు కాంగ్రెస్  అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పిన కేసీఆర్ తీరు మారలేదని, అధికారం కోసం గుంట నక్కలా కేసీఆర్ ఎదురుచు చూసిన ఫలితం ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓపికను పరీక్షించ వద్దని హెచ్చరిస్తున్నామని, తెలంగాణలో ప్రజాపాలన నడుస్తోందన్నారు. కేసిఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని, బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిపోయిన సీఎంఆర్ఎఫ్,చెక్కుల బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక కేసిఆర్ అండ్ కో ఓర్వలేకపోతోందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు. కారు పార్టీకి ఎన్ని రిపేర్లు చేసిన ఫలితం శూన్యమని ఎద్దేవా చేశారు.

There is no point in talking about the CM and ministers

కేసిఆర్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని, పార్టీ ఫిరాయింపు ల గురించి మాట్లాడానికి కేసీఆర్ కు సిగ్గు ఉండాలన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పి కొట్టి కాంగ్రెస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాణి నీకు మాట్లాడే నైతిక హక్కు లేదని, లోక్ సభ ఎన్నికల్లో గుండు సున్నా మర్చిపోయావా కేసీఆర్, మళ్ళీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కనడం మానుకో కేసీఆర్ అని రాష్ట్ర ఎక్సైజ్, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి క్రిష్ణారావు అన్నారు. ఉనికిని కోల్పోయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపితో లోపాయికారం ఒప్పందం పెట్టుకుందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లు చేర్చుకున్నప్పుడు నీ సోయి ఎటు పోయింది కేసీఆర్ అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ నేతలకే దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప అభివృద్ది గురించి మాట్లాడారని అన్నారు.బీజేపీ నేతలు దద్దమ్మలు అని, బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా వచ్చిన తీరు మార్చుకోలేదు దుయ్యబట్టారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి మోసం చేసిన బీజేపీ కి పార్టీకి ఓటేస్తారా.. ఏడాదిలో 56 వేలు ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా తేల్చుకోండని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, మాజీ ఎమ్మెల్సీ లు జీవన్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు.

There is no point in talking about the CM and ministers

More articles

Latest article