. . . ఎంఆర్ పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ
కమ్మర్ పల్లి, బతుకమ్మ :
భవిష్యత్తులో మన హక్కుల కోసం పోరాటం చేసి మహాజన రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సిన అవసరం మాదిగల మీద ఉందని ఎంఆర్ పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. మంగళవారం చౌటపల్లి గ్రామంలో మాదిగ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారత దేశ రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డా. బాబు జగ్జీవన్ రాం, డా. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిభా ఫూలే విగ్రహాలకి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మాదిగ యువజన సంఘం నాయకులు సత్యనారాయణ మాదిగ, రాజ్ కుమార్ మాదిగ, రజనీకాంత్ మాదిగ, కుల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో మాదిగ యువజన సంఘం నాయకులు మురళి మాదిగ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్మరపల్లి ఏఎంసీ చైర్మన్, సర్పంచ్ పాలేపు నరసయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి నాగం ప్రతాప్ మాదిగ, ఎంఆర్పీఎస్ మెండోర మండల అధ్యక్షులు మకురి మహేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ భీంగల్ మండల నాయకులు పాలేపు సత్యం మాదిగ, గ్రామ మాదిగ కుల సంఘ సభ్యులు, మాదిగ మహిళలు, మాదిగ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

