24 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లాలో సీబీఎస్ఈ పాఠశాలలు ఏడు మాత్రమే..

Must read

📰 Generate e-Paper Clip

. చాలా పాఠశాలలు తప్పుదోవ పట్టిస్తున్నాయి

. అనుమతుల పేరుతో చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దు

. విలేకరుల సమేవశంలో సీబీఎస్ఈ పాఠశాలల సంఘం ప్రతినిధులు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిల్లాలో ని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తాము సీబీఎస్ఈ అనుబంధమని, సీబీఎస్ఈ విధానాన్ని తాము అనుసరిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఘం ప్రతినిధులు అన్నారు.

నగరంలోని ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ లో సంఘం అధ్యక్షుడు సంతోష్ కుమార్, కార్యదర్శి ముజీబ్, సభ్యులు మారయ్యగౌడ్, పవన్ కుమార్, లక్ష్మీనర్సింహస్వామి విలేకరులతో మాట్లాడారు. సీబీఎస్ ఈ పేరుతో చాలా పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. సీబీఎస్ఈ అనుబంధం కోసం దరఖాస్తు చేసుకున్న మాత్రాన సీబీఎస్ఈ అనుబంధ హోదా లభించదని స్పష్టం చేశారు.

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి అధికారికంగా అనుబంధం పొందిన పాఠశాలలకే సీబీఎస్ఈ పాఠశాలలుగా వ్యవహరించే హక్కు ఉందని పేర్కొన్నారు. జిల్లాలో సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు నవ్యభారతి గ్లోబల్ స్కూల్, ఎస్ఎస్ ఆర్ డిస్కవరీ, ఎస్ఎస్ఆర్ స్కూల్(జన్నేపల్లి), నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రెసిడెన్సీ స్కూల్, సెయింట్ ఆన్స్ స్కూల్(ఆర్మూర్), క్షత్రియ స్కూల్(ఆర్మూర్) మాత్రమేనని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లలో చేర్పించే ముందు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ లో పరిశీలించాలని సూచించారు.

More articles

Latest article