- నిందితుడి అరెస్టు.. బంగారం స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి చోరీలు పాల్పడున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎల్.రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నాందెడ్ జిల్లాలోని కార్లా గ్రామానికి చెందిన నాందేవ్ ఆనందరావు జల్సాలకు అలవాటుపడి జిల్లాలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. గతంలో కూడా ఈ నిందితుడు పలు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు. గతనెల 5న మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన పరశు దేవానందం తన ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మాదాపూర్ లోనిసీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడు పాత నేరుస్తుడని గుర్తించారు. మాణిక్ బండార్ చెక్క వద్ద శనివారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసిన నిందితుడు అనుమాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన దొంగతనాలను ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 91గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ కేసు చేధనకు నిజామాబాదు డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ ఎల్.రాజా వెంకట్ రెడ్డి అధ్వర్యంలో నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్, మాక్లూర్ ఎస్ఐ.ఎం రాజశేకర్, సిబ్బందిని అభినందించారు.
