29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పీడీఎస్ బియ్యం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్నిశనివారం పట్టకున్నట్టు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. నగరంలోని మాలపల్లి లో అశోక్ లైలాండ్ వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 7టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్టు తెలిపారు. ఈ బియ్యం విలువ సుమారు రూ.3లక్షల వరకు ఉంటుందని తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వాహన డ్రైవర్ ను, వాహనాన్ని వన్ టౌన్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

More articles

Latest article