28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తాళం వేసిన ఇంట్లో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

  • 5 తులాల బంగారం, 800 గ్రాముల వెండి అభరణాల చోరీ..

 

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని యోగేశ్వర కాలనీకి చెందిన తోగటి భూమేశ్వర్ ఇంట్లో మంగళవారం ఉదయం వేళలోనే అందాజ 9 గంటల ప్రాంతంలో దొంగలు హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా సాయంత్రానికి వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. తొగటి భూమేశ్వర్ ఇంటికి తాళం వేసి మామిడిపల్లి లోని వృద్ధా శ్రమానికి వెళ్లాడు. భూమేశ్వర్ వృద్ధాశ్రమానికి వెళ్లిన తర్వాత వారి ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన 5 తులాల బంగారు ఆభరణాలను, 800 గ్రాముల వెండి ఆభరణాలను దోచుకుని చోరీ చేశారు.  వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు ఇంటికి తాళం వేసి వెళితే వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారు వెండి నగలను ఎత్తుకెళ్లారని బాధితులు తోగట్టి భూమేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.అంతకుముందు తాళం పగలగొట్టి ఇంట్లో కి చొరబడి దొంగతనానికి పాల్పడిన పరిసరాలను ఆర్మూర్ పోలీస్ బృందం, క్లూస్ టీం సభ్యులు పరిశీలించి వివరాలను సేకరించారు.

More articles

Latest article