25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ యువతను పచ్చి దగా చేశారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే పోలీసులతో అణిచివేస్తారా ?

 

. . . నిరుద్యోగులను ముందస్తు అరెస్ట్ లు చేయటం దుర్మార్గం

 

. . . 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి

 

. . . తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ లో అధికారంలోకి వస్తే ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ తెలంగాణ యువతను పచ్చి దగా చేశారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం హైదరాబాద్ కు వస్తున్న ఆయనను నిలదీశారు. మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన నిరుద్యోగుల గోడు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు వారంతా శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెన మెట్లుగా నిలిచిన యువత ఆశలను, ఆకాంక్షలను చిదిమేశారంటూ రాహుల్ గాంధీ పై మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ ను బోగస్ చేశారని, జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అన్న దాన్ని మరోసారి నిరూపించారన్నారు. ఉద్యోగాలిస్తామన్న మీ మాటను నిలబెట్టుకోమంటే పోలీసులతో అణిచివేస్తారా? రాహుల్ జీ, ఇది పోరాటాల పురిటిగడ్డ గుర్తు పెట్టుకోండని కవిత హెచ్చరించారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులంతా కాంగ్రెస్ కి ఖచ్చితంగా కర్రుకాల్చి వాత పెడతారని అన్నారు.

. . . ముందస్తు అరెస్ట్ లు దుర్మార్గం

రాహుల్ గాంధీని అడ్డుకుంటారన్న నెపంతో తెలంగాణలో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేయటాన్ని కల్వకుంట్ల కవిత ఖండించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సింది పోయి అర్ధరాత్రి నిరుద్యోగులను, జాగృతి కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయటం దుర్మార్గమని చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అక్రమంగా అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

More articles

Latest article