భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం.. కమనీయం..

0 9,866

 

. . . సకుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

 

. . . ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకు సన్మానం

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సతీమణి అమ్మమ్మ గారి గ్రామం.. జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ లో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శుక్రవారం కన్నుల పండువగా చేపట్టగా ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.

 

The wedding of Lord Venkateswara with Goddess Bhudevi.. is a blessing..

 

అనంతరం గర్భగుడిలో రంగనాయక స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు, పాడిపంటలు సుభిక్షింగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సమేతంగా అన్నప్రసాదం స్వీకరించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ను డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి ఆలయ నిర్మాణం విషయమై విన్నవించగా తప్పకుండా తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణంతో పాటు గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల వరకే పార్టీలు అని గెలిచిన తర్వాత అభివృద్దే పరమావధి అని పేర్కొన్నారు. రాజకీయ భేషజాలకు పోకుండా గ్రామస్తులు ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కారం చూపిస్తానని సూచించారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు చిన్నా రెడ్డి,  జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ముసుకు సాయి రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కౌలాస్ మోహన్, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, పార్టీ యువనాయకులు ఉమ్మాజి నరేష్ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పెద్దలు, పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

The wedding of Lord Venkateswara with Goddess Bhudevi.. is a blessing..

Leave A Reply

Your email address will not be published.