27.7 C
Hyderabad

వన మహోత్సవంను విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటే విధంగా ఏర్పాటు చేస్తున్నామని మోర్తాడు ఏపీవో శకుంతల అన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలోని నర్సరీని ఆమె పరిశీలించారు. నర్సరీ లో పెరుగుతున్న పూల మొక్కలను పండ్ల మొక్కలను అలంకరణ మొక్కలను పరిశీలించి, నిర్వహణ విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు నరేష్, నర్సరీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article