జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ.
నిజామాబాద్, బతుకమ్మ :
ప్రజలకు న్యాయసేవలు అందించడమే ప్రధాన ద్యేయంగా న్యాయసేవల చట్టం రూపకల్పన జరిగిందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. న్యాయసేవల చట్టం దినోత్సవం సందర్బంగా జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రధానోపన్యాసం చేశారు. ఉచిత న్యాయ సహాయం ప్రజలకు సంస్థ అందించిన మహాత్తరమైన కార్యమని ఆమె అన్నారు.గ్రామ అభివృద్ధి కమిటీల అక్యుత్యాలకు అడ్డుకట్ట వేశామని, కొన్ని విడిసిలు వాటిని రద్దు చేసుకోవడం ఒక గొప్ప విజయంగా ఆమె అభివర్ణించారు. న్యాయం కోరుకునే వారికి ఆలంబనగా న్యాయసేవ సంస్థ నిలబడుతున్నదని ఆమె అన్నారు.అసమానతలను, వెలివేతలను ఎదుర్కొంటున్న వారికి అండగా న్యాయసేవ సంస్థ అండగా ఉంటు చట్ట రక్షణను కల్పిస్తున్నదని అన్నారు. న్యాయసేవ సంస్థ విజయాలలో మీడియా పాత్రనే ఎక్కువ అని,అందుకు సంస్థ కృతజ్ఞతరాలిగా ఉంటుందని తెలిపారు. వ్యక్తులుగా వ్యవస్థలకు వస్తుపోతమని కాని వ్యవస్థలే కలకాలం ఉంటాయని ఆమె వివరించారు. వాసవి జనత పౌండేషన్ సహకారంతో వీల్ చైర్ ను దివ్యాంగుడైన భార్గవ్ కు జిల్లాజడ్జి భారత లక్ష్మీ అందజేశారు. అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్ మాట్లాడుతు న్యాయసేవల చట్టం ప్రతివారు వినియోగించుకోవాలని కోరారు.జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అదనపు జిల్లాజడ్జిగా పదోన్నతి పొందిన ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ సంస్థ గొప్ప లక్ష్యం ఉచిత న్యాయసేవలేనని తెలిపారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి మాట్లాడుతూ సంస్థ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి న్యాయవాదులు సహాయకారలుగా ఉంటారని అన్నారు.కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి కుష్భూ ఉపాధ్యాయ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు గోపికృష్ణ, హరి కుమార్, శ్రీనివాస్ రావు, బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, వాసవి జనతా పౌండేషన్ సభ్యులు నితిన్, సాయి ప్రసాద్, సాయికృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
