ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తానని తపస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కానుగంటి హనుమంతరావు ఆధ్వర్యంలో సోమవారం కార్యనిర్వాహక వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానిక హాజరై ఆయన మాట్లాడారు. తనకు గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పట్ల నిరంతరం తన గళాన్ని వినిపిస్తానని హామీ ఇచ్చారు. నిరంతరం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు కనుగొంటి హనుమంతరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అన్ని డీఏలను వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పరళి కృష్ణవేణి, బట్టు బద్రీనాథ్, ఏబీఆర్ఎస్ఎం బాధ్యులుపాలేటి వెంకట్రావు, రాష్ట్ర బాధ్యులు రామకృష్ణారెడ్డి, కీర్తి సుదర్శన్, 33మండలాల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

