24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలం మీసాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇండ్ల లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరుగుతుందని, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు మంజూరు చేయడానికి సర్వే చేపడుతున్నామని తెలిపారు. స్వంత భూమి ఉండి నిరూపేద లైన వారి వివరాలు, ఫోటోలు, భూముల వివరాలు, సేకరించి యాప్ లో పొందుపరుస్తున్నా మని తెలిపారు. సర్వేయర్లు ఇండ్ల కోసం ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పకడ్బందీగా, పక్కాగా సేకరించి యాప్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. సర్వే పనులను వేగవంతం చేయాలని, రోజుకు కనీసం 30 నుండి 40 వరకు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, నాయాబ్ తహసీల్దార్ చరణ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

The survey of Indiramma houses should be done properly

More articles

Latest article