నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : నాగిరెడ్డి పేట్ మండలంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఇతర పార్టీల నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ మాజీ సర్పంచ్ కే.నర్సాగౌడ్, కె.మల్లయ్య, కే.శ్రీనివాస్ గౌడ్, కె.బాబు, చీనూర్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ నారా గౌడ్, ఆంజనేయులు, నిఖిల్ ధనుష్ వెంకటేష్, లింగంపల్లి మాజీ సర్పంచ్ కిష్టయ్య, ఆత్మకూర్ గ్రామ నాయకులు బి.యోహాన్, అంతయ్య, సంగమేశ్వర్, సాయిలు, బజుగం చెరువు తండా పిఎసిఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్, తుల్జా నాయక్, రామచంద్ర, బాబు, ఎర్రారం నాయకులు కిష్టయ్య, శివాజీ, కాంతం దుర్గయ్య, మోహన్, రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
