26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గురుకులాలను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం

Must read

📰 Generate e-Paper Clip

  • భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్
  • గురుకుల సమస్యలపై రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి వినతి పత్రం

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :రాష్ట్రంలో ఉన్న గురుకులాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా రవి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకులల్లో రోజుకో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరుగుతుంది అని అన్నారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుండి దాదాపు 95 మంది విద్యార్థులు చనిపోవడం జరిగిందన్నారు.ఇంత జరుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల సమస్యలపై మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నాయకత్వంలో గురుకుల వ్యవస్థ ఎంత ప్రతిష్టంగా ఉన్నదో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారైందని అన్నారు.విద్యార్థి తల్లిదండ్రులు గురుకులాలకు పంపియాలంటేనే భయపడే పరిస్థితి తీసుకు వచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వందేనని అన్నారు. గురుకుల విద్యార్థుల గోస కనిపియ్యకపోవడం చాలా బాధాకరమని,తరగతి గదిలో చదువుకునే విద్యార్థులు నడిరోడ్డు మీదికి రావడం మా సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేదా అని ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా గురుకుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లూరి సాయికిరణ్, ముధం అనిల్ గౌడ్,ఎస్ కె అప్రోచ్, హరీష్, జోయల్, శివ, రాకేష్, కృష్ణ,వంశీ,రోహిత్,విష్ణు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article