- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చిన్నపిల్లల్లో క్షయ వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ అన్నారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా స్థాయిలో పిల్లల వైద్యులు,స్టాఫ్ నర్సులకి, ఎన్టీఈ పి సిబ్బంది కి ఒక రోజు శిక్షణ కార్యక్రమం ను గ్లోబల్ ఫండ్, సాతి,టిబి అలెర్ట్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లోనీ ఏడవ అంతస్తులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే నమోదు చేసి వ్యాప్తి చెందకుండా చికిత్సను అందించాలని అన్నారు. ప్రతీ ఒక్క ఆసుపత్రిలో క్షయకు సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లు ఉండాలని, శిక్షణ లో నేర్చుకున్న అంశాలను మీ మీ సిఎస్సి పరిధిలోని పి హెచ్ సి వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశలకు శిక్షణ కార్యక్రమం ద్వారా తెలియజేయాలన్నారు. ఆసుపత్రులలో క్షయ వ్యాధిని పిల్లల్లో త్వరితగతిన గుర్తించి ఇతరులకు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ రమేష్, డాక్టర్ అంజన, డాక్టర్ రాజు, సూపరింటెండెంట్ లు, శ్రీనివాస్ ,శ్రీనివాస్ ప్రసాద్ ,జిల్లా క్షయ నిర్మూలన అధికారి దేవి నాగేశ్వరి, రిసోర్స్ పర్సన్ లైన పిల్లల వైద్యం చెప్పి పిల్లలు డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ హరిప్రియ, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆజ శ్రీనివాస్ , ప్రోగ్రాం అధికారులు డాక్టర్ తుకారం రాథోడ్ , డి ఐ ఓ డాక్టర్ అశోక్ ,డాక్టర్ వినీత్ రెడ్డి,డి సి రవి గౌడ్, టిబి అలెర్ట్ ఇండియా మేనేజర్ హెప్సిబ, ఉష రాణి,అమృత, రాజేందర్, డిహెచ్ఈ గన్ పూర్ వెంకటేశ్వర్లు, నరేష్, సుధాకర్ పాల్గొన్నారు.

