26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ జాతీయ జెండాను ఎగురవేసి, ఎన్.సి సి. క్యాడెట్ల గౌరవ వందనం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు గుర్తుంచుకోవాలని అన్నారు. రాష్ట్రం లోనే డిగ్రీ ప్రవేశాలకు, ఫలితాలకు ఉన్న విశిష్టతను కొనసాగించాలన్నారు. ఉత్తమ అధ్యాపకుడిగా కామర్స్ విభాగం అధిపతి కే వినయ్ కుమార్ ఎంపికయ్యారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగరత్నం మాట్లాడుతూ డిగ్రీ, పీజీ లలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ నెల 31న గ్రాడ్యేషన్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్.సి.సి. నుండి ఎస్. దేవిదాస్ రిపబ్లిక్ డే పరేడ్ దిల్లీలో, నరేష్, వెంకుల్, ఇద్దరు కాడేట్లు రాష్ట్ర పరేడ్ లో, పది మంది జిల్లా పరేడ్ లో పాల్గొన్నారని లెఫ్టినెంట్ రామస్వామి తెలిపారు. వివిధ పోటీలలో, క్రీడలలో విజేతలకు సర్టిఫికెట్స్ అందించారు.

 

 

The spirit of the Constitution must be maintained.

More articles

Latest article