రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ జాతీయ జెండాను ఎగురవేసి, ఎన్.సి సి. క్యాడెట్ల గౌరవ వందనం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు గుర్తుంచుకోవాలని అన్నారు. రాష్ట్రం లోనే డిగ్రీ ప్రవేశాలకు, ఫలితాలకు ఉన్న విశిష్టతను కొనసాగించాలన్నారు. ఉత్తమ అధ్యాపకుడిగా కామర్స్ విభాగం అధిపతి కే వినయ్ కుమార్ ఎంపికయ్యారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్...