23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

తల్లిని చంపిన తనయుడు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ , బాన్సువాడ ; కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలంలో అంజవ్వ తన భర్త చనిపోతే వచ్చిన బీమా డబ్బులు కొన్ని కొడుకుకి ఇచ్చి, మరి కొన్ని బ్యాంకులో పొదుపు చేయగా, ఇచ్చిన డబ్బులు మద్యానికి ఖర్చుపెట్టి, మళ్లీ బ్యాంకులో వేసిన డబ్బులు కోసం తల్లిని వేధించి ఆమె ఇవ్వకపోవడంతో కర్రతో తల్లిని కొట్టి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ కేసు మంగళవారం చోటు చేసుకోగా దీనిని సహజ మరణంగా చిత్రికించడానికి ప్రయత్నించి చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది . తల్లిని చంపిన తల్లియుడికి కటకటాల పాలు చేస్తున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లానసురుల్లాబాద్ మండలం దుర్కీ గ్రామంలో గత ఏడాది అంజవ్వ భర్త మరణించడంతో ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు వచ్చాయి ఈ డబ్బులు నుంచి కొన్ని కుమారుడికి తల్లి కొన్ని ఇచ్చి ,మరి కొన్ని డబ్బులు బ్యాంకులో పొదుపు చేసింది. అవి ఇవ్వాలని తల్లితో నిత్యం సాయికుమార్ , మంగళవారం ఈ విషయంపై తల్లి కొడుకు వాగ్వాదం జరిగింది.మళ్లీ మంగళవారం అడగగా ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో తల్లిని కర్రతో కొట్టి హత్య చేశాడు. సాయికుమార్ఆవేశంలో కర్రతో తల్లి తలపై కొట్టడంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article