27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది

Must read

📰 Generate e-Paper Clip

  • రేవంత్ రెడ్డి ప్రభుత్వానివి 6 అబద్ధాలు- 66 మోసాలు
  • కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎటు పోయింది
  • రైతు భరోసా, కౌలు రైతులకు భరోసా ఎప్పుడు
  • మహిళలకు ఇస్తా అన్న 2500, చదువుకున్న విద్యార్థులకు స్కూటీ, కళ్యాణ లక్మి కింద తులం బంగారం ఏమైనట్టు
  • గృహజ్యోతి అమలు సరిగ్గా లేదు
  • కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పించన్ గాని, రేషన్ కార్డు గాని మంజూరు చేయలేదు
  • నిరుద్యోగులకు ఇస్తా అన్న 4000 నిరుద్యోగ భృతి ఏమైంది
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తారా

కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ ప్రజల పరిస్థతి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార అన్నారు.  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకతతో కాంగ్రెస్ కి ఓటు వేస్తే అంతకు మించి ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానివి 6 అబద్ధాలు- 66 మోసాలని అన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతు భరోసా సరిగా రాలేదని యసంగి పంటకి రైతు భరోసా, కౌలు రైతులకు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మహిళలకు ఇస్తా అన్న 2500, చదువుకున్న విద్యార్థులకు స్కూటీ, కళ్యాణ లక్మి కింద తులం బంగారం ఏమైనట్టు అని ప్రశ్నించారు. గృహజ్యోతి అమలు సరిగ్గా లేదని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కొత్తగా ఒక్క పించన్ గాని, రేషన్ కార్డు గాని మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఇస్తా అన్న 4000 నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు.

More articles

Latest article