29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

‘సర్‌’ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బాన్సువాడ ఆర్డీఓ ఎడ్ల రవీందర్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

సర్‌ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని బాన్సువాడ ఆర్డీఓ ఎడ్ల రవీందర్ బిఎల్ఓలకు, అధికారులకు ఆదేశించారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమికృత సముదాయ కార్యాలయం వద్ద చేపడుతున్న సర్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలో రాష్ట్రంలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్‌) ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ తారాబాయి, డిప్యుటీ తహసీల్దార్ సురేందర్ నాయక్, బిఎల్ఓలు తదితరులు ఉన్నారు.

More articles

Latest article