. . . రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్
హైదరాబాద్, బతుకమ్మ :
సేవాదళ్ సంస్థను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నూతన పదాధికారులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ చేతుల మీదుగా నూతనంగా నియమితులైన జిల్లా, అసెంబ్లీ, టౌన్, మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గడ్డమీది మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిగా మెహర్ బాబా గౌడ్, కామారెడ్డి టౌన్ అధ్యక్షుడిగా కోమ్మరాజుల సుదర్శన్, కామారెడ్డి మండల అధ్యక్షుడిగా ప్రణీత్ కుమార్, రాజంపేట మండల అధ్యక్షుడిగా వేణుగోపాల చారి, పాల్వంచ మండల అధ్యక్షుడిగా హరీష్, మాచారెడ్డి మండల అధ్యక్షుడిగా మలోత్ మహేష్, దోమకొండ మండల అధ్యక్షుడిగా దోర్నాల ప్రవీణ్ కుమార్, బీబీపేట్ మండల అధ్యక్షుడిగా కలకుంట్ల రాజు, బిక్నూర్ మండల అధ్యక్షుడిగా గిజువెల్లి మాధవ రెడ్డిలకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సేవా దృక్పథంతో ముందుండి పనిచేస్తూ సంస్థను మరింత విస్తరించేందుకు కృషి చేయాలని సూచించారు. నూతనంగా నియమితులైన పదాధికారులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవాదళ్ బలోపేతానికి కృషి చేస్తామని, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు.
