. . . పోద్ధున నుంచే ఒట్లు వేసెందుకు పోటేత్తిన జనం.
. . మాక్ పోల్ తరువాత ప్రారంభమైన పోలింగ్
.. . కట్టుదిట్టమైన ఎర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
నిజామాబాద్, బతుకమ్మ :
రెండో విడత పంచాయతి ఎన్నికలకు ఓట్లు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగాలు పోలింగ్ కోసం ఎర్పాటు చేశాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతుండటంతో అభ్యర్ధులు ఓటర్లను రప్పించి ఓట్లు వేయించేందుకు కసరత్తు చేశారు. నిజామాబాద్ డివిజన్ లోని మోపాల్ మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి,ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లాలో రెండొ విడత పంచాయతీ ఎన్నికలలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 20.49 శాతం పోలింగ్ జరిగింది. 40,929 మంది ఓటు హక్కును వినియోగించు కున్నారు. నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలలో 158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా568 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అదేవిధంగామొత్తం 1081 వార్డుస్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 2634 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అన్నారు. రెండోవిడతలో మొత్తం 1476 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,38,838 మంది ఓటర్లు తమఓటు హక్కును వినియోగించుకోనేందుకు అధికారులు ఎర్పాటు చేశారు. పోలిస్ శాఖ 1120 మందితో బారిగా బందోబస్తు ఏర్పాటు చేసింది.

కామారెడ్డి జిల్లాలో 153 సర్పంచ్ పధవులకు అదివారం ఉదయం 7 గంటల నుంచి మద్యహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 153 జిపిలలొ సర్పంచ్ పోస్టుల కొసం 506 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. సంబంధిత ఎడు మండలాల్లోని 873 వార్డు మెంబర్ పోస్టులకు ఎన్నికలు జరుగనున్నాయి.2655 మంది బరిలో నిలిచారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోజుక్కల్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 1,89,177 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనేందుకు బారులు తీరారుకామారెడ్డి జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు కట్టుదిట్టమైన భధ్రత ఎర్పాట్ల మద్య పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.కామారెడ్డి జిల్లా లో ఉదయం 7 గంటల నుంచి 9 గంట ల వరకు 20.96 శాతం ఓట్లు పోలయ్యాయి. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
