28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సాయంత్రంతో ముగియనున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి మండలాలలో గ్రామపంచాయతీ మరియు వార్డు సభ్యుల ఎన్నికల రెండో విడత నామినేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది.  అధికారులు ఉదయం 10:30 గంటలనుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రాల్లో భారీ రద్దీ కనిపించింది.  ఎల్లారెడ్డి డివిజన్ వ్యాప్తంగా నామినేషన్ కేంద్రాలను సీఐ దొరవారి రాజరెడ్డి పర్యవేక్షించారు. నామినేషన్లకు వచ్చిన అభ్యర్థులు మరియు వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సీఐ దొరవారి రాజరెడ్డి మాట్లాడుతూ నామినేషన్ వేయడానికి అభ్యర్థులు ఒక్కరి వెంట ఇద్దరు మాత్రమే బలపరిచే వ్యక్తులను తీసుకుని రావాలని నామినేషన్ కేంద్రాల వద్ద అనవసర రద్దీ కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.  ఎల్లారెడ్డి డివిజన్‌లో నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

The second phase of nominations will conclude in the evening.

More articles

Latest article