సాయంత్రంతో ముగియనున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి మండలాలలో గ్రామపంచాయతీ మరియు వార్డు సభ్యుల ఎన్నికల రెండో విడత నామినేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. అధికారులు ఉదయం 10:30 గంటలనుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రాల్లో భారీ రద్దీ కనిపించింది. ఎల్లారెడ్డి డివిజన్ వ్యాప్తంగా నామినేషన్ కేంద్రాలను సీఐ దొరవారి రాజరెడ్డి పర్యవేక్షించారు. నామినేషన్లకు వచ్చిన అభ్యర్థులు మరియు వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు...