రుద్రూర్, బతుకమ్మ: ఇసుక మాఫియా రోజురోజుకూ రెచ్చిపోతోంది. అనుమతులు ఒక చోట పొంది మరో చోటు నుంచి ఇసుక తరలిస్తూ డంపులు చేస్తోంది. పొతంగల్ మంజీరా నది నుంచి జలాల్ పూర్ గ్రామానికి ఇసుక అనుమతులు తీసుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి ఇసుక డంపింగ్ చేస్తున్నారు. ఇలా ఇసుకాసురులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.

