27.6 C
Hyderabad
Wednesday, August 5, 2026

పెరుగుతున్న రద్దీ కోసమే సైదాబాద్, మూసారాంబాగ్ ప్రాజెక్టులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, మూసారాంబాగ్ ప్రాజెక్టులను చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో కీలక మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, మూసారాంబాగ్ వంతెన పనులను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రులు, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రూ.680 కోట్ల వ్యయంతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని త్వరలోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే నగరంలోని ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. మూసారాంబాగ్ వంతెనను కూడా త్వరలోనే ప్రారంభించి ప్రజల వినియోగానికి అందుబాటు లోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఫ్లైఓవర్లు, వంతెనలను నిర్మిస్తోందని మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. ఈ ప్రాజెక్టులు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article