23.7 C
Hyderabad

అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

Must read

📰 Generate e-Paper Clip

ఎఫ్ డి ఓ సుధాకర్ రావు

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ :  జాతి సంపద అయిన అటవీ ని రక్షించేందుకు తమ ప్రాణాలను ఓ డ్డీన అటవీ శాఖ ఉద్యోగుల త్యాగాలను మరువలేనివని నిజామాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సుధాకర్ రావు అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో అసువులు బాసిన అటవీ అధికారులు సిబ్బందికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్డిఓ మాట్లాడుతూ అటవీ శాఖ ఉద్యోగుల కు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది అన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఇటీవల ప్రభుత్వం పోడు చట్టాలను అమలు చేస్తున్న నేపథ్యంలో అటవి శాఖ ఉద్యోగులకు అడవి ప్రాంత సంరక్షణ కత్తి మీద సాముల మారిందన్నారు. గతంలోనూ నిజామాబాదులో పలువురు ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని సంరక్షించారన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు సంజయ్ గౌడ్ రవి మోహన్ బట్, సెక్షన్ ఆఫీసర్లు ,బీట్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

The sacrifices of the forest martyrs are unforgettable

More articles

Latest article