. . . వీబీజీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి
. . . కామరెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ వెల్లడి
కామారెడ్డి, బతుకమ్మ:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తూ, గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ బద్ధంగా లభించిన అధికారాలను నిర్వీర్యం చేసిందని, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన వికాసిక భారత్ గ్యారంటీ ఫర్ రోజు కార్ అండ్ అజివిక మిషన్ చట్టం గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమాదకరమైన విధాన మార్పులను పూర్తిగా తిరస్కరిస్తున్నాం అన్నారు. టి పి సి సి జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

