- ప్రముఖ విద్యావేత్త, సామజిక కార్యకర్త ప్రవీణ్ తాడూరి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ వర్సిటీ ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త ప్రొ.కే.అపర్ణ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జాతి ఐక్యతలో ఉక్కు మనిషి పాత్ర అనే అంశం పై జిల్లాలోని వివిధ డిగ్రీ, పీజీ కళాశాల ల విద్యార్థులకు ఆగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ప్రముఖ విద్యావేత్త, సామజిక కార్యకర్త ప్రవీణ్ తాడూరి ప్రసంగిస్తూ ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశాన్ని నిర్మించిన మహా నాయకులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖులు అన్నారు. దేశ చరిత్రలోనే అత్యంత సంక్లిష్ట సమయంలో సంస్థానాలన్నింటినీ మన జాతీయ జెండా కిందికి చేర్చారన్నారు. సర్దార్ పటేలు ఒక దార్శనికులు సమర్ధ పాలకులు అద్భుతమైనకార్యనిర్వాహకులు గొప్ప సంఘసంస్కర్త అని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత తోనే దేశ ఐక్యత, సార్వభౌమత్వం ఈ ఉక్కు మనిషి ద్వారానే సాధ్యమైందని కొనియాడారు. యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శనంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ స్రవంతి, డాక్టర్ స్వప్న, డాక్టర్ అలీం ఖాన్, డాక్టర్ సంపత్, డా సరిత జూనియర్ అసిస్టెంట్ సురేష్ విద్యార్థినీ, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
