27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర అన్నారు. ఆయన ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎలక్షన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్షన్ సమయంలో  ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదని, కులము, వర్గము, ప్రాంతీయ గొడవలు కాకుండా చూడాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేయాలని ఆయనన్నారు. ఈ విషయాన్ని పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, పిసి.సాయిలు పాటల ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ కార్యక్రమంలో దేవునిపల్లి సబ్-ఇన్స్పెక్టర్ భువనేశ్వర్ రావు పాల్గొన్నారు.

More articles

Latest article