ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలి

  కామారెడ్డి, బతుకమ్మ :   ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర అన్నారు. ఆయన ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎలక్షన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్షన్ సమయంలో  ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదని, కులము, వర్గము, ప్రాంతీయ గొడవలు కాకుండా చూడాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేయాలని ఆయనన్నారు. ఈ విషయాన్ని పోలీస్...