23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

24న ఈ ఆర్ సి బహిరంగ విచారణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఐదవ నియంత్రణ కాలానికి గాను విద్యుత్ స్లాబ్ రేట్ల పెంపుదలపై 24న బహిరంగ విచారణ జరగనుందని ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ లో గల సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభమవుతుందన్నారు. 2024-25 నుంచి 2028-29 వరకు విద్యుత్ ఆదాయ, వ్యయాలు,ధరలు పెంపుదలపై వినియోగదారుల సలహాలు, సూచనలు తీసుకోబడుతుందన్నారు. ఈ బహిరంగ విచారణకు ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తో పాటు కంపెనీ సీఎండి, సీజిఏంలు, 16 జిల్లాల ఎస్ఈ లు, డీఈఈలు, ఏడిఈలు, ఏఈలు పాల్గొననున్నారని చెప్పారు. రాజకీయ నాయకులు, ప్రజలు, వినియోగదారులు బహిరంగ విచారణలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించాలని ఆయన కోరారు.

More articles

Latest article