24న ఈ ఆర్ సి బహిరంగ విచారణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఐదవ నియంత్రణ కాలానికి గాను విద్యుత్ స్లాబ్ రేట్ల పెంపుదలపై 24న బహిరంగ విచారణ జరగనుందని ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ లో గల సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభమవుతుందన్నారు. 2024-25 నుంచి 2028-29 వరకు విద్యుత్ ఆదాయ, వ్యయాలు,ధరలు పెంపుదలపై వినియోగదారుల సలహాలు, సూచనలు తీసుకోబడుతుందన్నారు. ఈ బహిరంగ విచారణకు ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తో పాటు కంపెనీ సీఎండి, సీజిఏంలు, 16 జిల్లాల ఎస్ఈ లు,...