29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కేజీబీవీ, గురుకుల, సంక్షేమ హాస్టల్స్ సమస్యలను పరిష్కరించాలి 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ ,గురుకుల స్కూల్స్,  సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ,గురుకులాలు మరియు సంక్షేమ హాస్టలల్స్ దాదాపు 150 వరకు ఉన్నాయని వీటిలో 40 వేల మంది విద్యార్థుల వరకు విద్యను అభ్యసిస్తూ, అక్కడ అందించేటటువంటి భోజన సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని అన్నారు. అయితే జిల్లాలో ఉన్న హాస్టల్లో ఎక్కువ శాతం హాస్టల్స్ లో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవని మరియు విద్యార్థుల సంఖ్య కనుగుణంగా సరిపడని గదులు గల హాస్టల్స్ కూడా లేవని, వీటితోపాటు శిథిలావస్థలో ఉన్న హాస్టల్స్ మరియు అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టల్స్ ఉన్నాయని ఇందులో అరకొర సదుపాయాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా కొన్ని హాస్టల్లో సరైన బాత్ రూమ్స్ లేక, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక విద్యార్థులు తరచూ అనారోగ్యం బారిన పడటం వల్ల సరైన విద్యను అభ్యసించడం కూడా జరగడం లేదని, పలుమార్లు సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం మాత్రం మారలేదని అన్నారు. అదేవిధంగా యుఎస్ఎఫ్ఐ  విద్యార్థి సంఘంగా సమస్య తీవ్రతను వ్యక్తపరచిన సందర్భంలో సంబంధిత శాఖ అధికారులు నానామాత్రపు తనిఖీలు నిర్వహించడం సమంజసం కాదని అన్నారు. అదేవిధంగా ఇటీవలే మృతి చెందిన వాంకేడి ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం అందించాలని అలాగే నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ హాస్టల్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, అక్కడ అందించే భోజనంలో నాణ్యతను పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరడం జరిగిందని తెలియజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ నగర సహాయ కార్యదర్శులు సంతోష్,అజయ్  నగర నాయకులు విశాల్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article