26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఎప్పుడు పూర్తవుతుందో అని ఎదురుచూస్తున్న జుక్కల్ ప్రజలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కొన్ని రోజులు వేగంగా సాగిన పనులు

 

. . . ఇప్పుడు నత్త నడకన సాగుతున్న పనులు

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ పనులు నత్తనడకగా కొనసాగుతున్నాయి. కొన్ని నెలలుగా ప్రారంభించిన పనులు కొన్ని రోజులు శరవేగంగా కొనసాగినప్పటికీ ప్రస్తుతం నత్తనడకగా కొనసాగుతున్నాయని మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ఈ సీజన్ లో నైనా పనులను పూర్తి చేసి జుక్కల్ మండల కేంద్రానికి కొత్త పంటలు వస్తాయని అనుకున్న గ్రామస్తులు పనులు వేగం పెరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పనులు ఇలాగే కొనసాగితే ఎన్ని నెలలు అయినా పూర్తి కాదని మండల కేంద్రంలోని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు, గుతేదారుడు స్పందించి పనుల వేగం పెంచాలని, వర్షాకాలం కంటే ముందే సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసి గ్రామానికి వన్నే తెచ్చే విధంగా  తోడ్పాటు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

More articles

Latest article