- పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 2003 ఉద్యోగ ఉపాధ్యాయుల కు కోర్టు తీర్పు ను అమలు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సచివాలయంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ అమలు తేదీ 01.09.2004 కు ముందు నియామక నోటిఫికేషన్ లు విడుదలై 01.09.2004 తరువాత ప్రభుత్వం ఆలస్యం కారణంగా, నియామకం జరిగి సిపిఎస్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి అని గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా 3 నెలలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. కావున 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి అని వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్షి రామకృష్ణారావు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్షి ఇమ్మడి సంతోష్ కుమార్, రాష్ట్ర కోశాధికారి గుంటి వేణుగోపాల్, రాష్ట్ర నాయకులు అంబెల్లి శంకర్, యు.విజయ్ కుమార్, మాణిక్యం, వేణు మాధవ్, జమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- వేం నరేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సభ్యులు..
2003 డీఎస్సీ వారికి కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పాత పెన్షన్ వర్తింపచేయాలని పాత పెన్షన్ నాయకులు హైదరాబాదులో సిఎస్ రామకృష్ణారావుని, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని 2003 డిఎస్సి ఉపాధ్యాయులు మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుద్వారా 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ వర్తిస్తుందని తీర్పురావటం సంతోషంగా ఉందని దీనికి కృషి చేసిన 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు.

