27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగలు

Must read

📰 Generate e-Paper Clip

  • బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బిఆర్ఎస్
  • రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

 

ధర్పల్లి, బతుకమ్మ : గత పార్లమెంట్ ఎన్నికల్లో  బిఆర్ఎస్, బిజెపి  కలిసి పనిచేశాయని, అందుకే టిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని, బిజెపి, బిఆర్ఎస్ తోడు దొంగలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి విమర్శించారు. ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో రామడుగు ప్రాథమిక సహకార సంఘం  ఆధ్వర్యంలో  30 లక్షల నిధులతో  గోదాం నిర్మాణానికి నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి   భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా  ముఖ్యఅతిథిగా హాజరై , ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, తెలంగాణ లో ఉన్న బిఆర్ఎస్ పార్టీలు  రెండు తోడు దొంగలని అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి  రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవిత.. నేడు బీసీ నిదానం ఎత్తుకుంటే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాంగ్రెస్‌ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించిందని, బీజేపీ ఎమ్మెల్యేలు బిల్లుకు మద్దతు ఇచ్చి పార్లమెంట్‌లో ఎంపీలు మాట

BRS and BJP are accomplices

మార్చారని విమర్శించారు. వైఎస్‌ బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ ఇస్తే,గత ప్రభుత్వం బీసీలకు 27 శాతనికి తగ్గించరని అన్నారు. కాంగ్రెస్‌ ఆలోచన విధానాన్ని గమనించాలని అన్నారు. గత ప్రభుత్వం  10 ఏళ్లలో  ఏ ఒక్కరికి రేషన్‌కార్డు ఇవ్వలేదని, 18 నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్‌కార్డులతోపాటు అనేక పథకాలు అమలుచేస్తుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఆలోచనా విధానాన్ని ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం  పేదోడి ప్రభుత్వమని తెలిపారు. సన్నబియ్యం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.3వేల కోట్ల భారం పడుతుందన్నారు. మోదీ ప్రభుత్వమే సన్నబియ్యం ఇస్తుందని బీజేపీ వారు చెప్పుకుంటున్నారని, వారు 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారని, అక్కడ ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పాలని పేర్కొన్నారు. సమావేశంలో  సొసైటీ చైర్మన్ రాజేందర్, సొసైటీ డైరెక్టర్లు శంకర్, మైపాల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్న బాల్ రాజ్, అమృత పూర్ గంగాధర్ డిచ్పల్లి సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్, సీనియర్ నాయకులు  మునిపల్లి  సాయిరెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, గంగాధర్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్, గ్రామ శాఖ అధ్యక్షులు మధు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

BRS and BJP are accomplices

More articles

Latest article