26.2 C
Hyderabad

తల్లీకొడుకుల మిస్సింగ్ కేసు సుఖాంతం

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ: ఈ నెల 5న ఎక్లాస్ పూర్ గ్రామానికి మాటలు రాని మహిళా తన కొడుకు అదృశ్యం అయినట్లు  స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  పక్షం రోజుల తర్వాత ఎట్టకేలకు పోలీసులు  కేసులు చేదించి తల్లి కొడుకును కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పజెప్పారు. స్థానిక ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం ఎక్లాస్పూర్ గ్రామనికి చెందిన బండారి సుజాత(24) అనే మాటలు రాని మహిళా తన ఏడాదిన్నర  కొడుకు అద్విత్ ను తీసుకోని ఈ నెల ఐదవ తేదీన  ఉదయం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయిది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని బోధన్ ఏసీపి శ్రీనివాస్ విచారణలో భాగంగా రెండు బృందాలుగా ఏర్పడి తల్లి, కొడుకు ఆచూకీ వెతకగా  ఈనెల 14వ తేదీన  కరీంనగర్లో  బండారు సుజాతను పోలీసులు వెతికి పట్టుకున్నారు. అనంతరం బాలుడు అద్విత్ ను 20వ తేదీన ఆచూకీ లభించగా ఇరువురిని శుక్రవారం కుటుంబ సభ్యులకు  అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు.

More articles

Latest article