24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ పాలనలోనే మైనింగ్ మాఫియా జరిగింది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దానిపై సీబీసీఐడి విచారణకు ఆదేశం

 

. . . అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

అసెంబ్లీలో శనివారం జరిగిన మైనింగ్ అక్రమాల వ్యవహరం చిలికిచిలికి గాలివానలా మారింది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేసిన అసెంబ్లీలో తీవ్ర దుమారం లేపాయి. మైనింగ్ అక్రమాలపై విచారణ జరుగడం లేదని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మైనింగ్ అక్రమాలపై విచారణకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నానని సీఎం అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాఘవ కన్ స్ట్రక్షన్ రూల్స్ ప్రకారం వ్యవహరించిందని, వివాదం లేవనెత్తాలని బీఆర్ఎస్ చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. బీఆర్ఎస్ మంత్రులను బ్లాక్ మెయిల్ చేస్తే ప్రభుత్వం భయపడదని బ్లాక్ మెయిల్ వ్యవహరాలు ఇంకో దగ్గర చూసుకోండని సీఎం తీవ్రంగా స్పందించారు. రాఘవ కన్ స్ట్రక్షన్ కు తాము నోటీసులు ఇచ్చిన విషయాన్నిగుర్తు చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఏ చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ విషయంలో రాజీపడేది లేదని అన్నారు. గతంలో బీఆర్ఎస్ హయంలో మైనింగ్ మంత్రులుగా కేటీఆర్, హరీష్ లు ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై విచారణ జరుపాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా సిరిసిల్లా జిల్లాలో నేరెళ్లలో జరిగిన ఇసుక మాఫియా దాష్టీకాలు ప్రపంచానికి తెలుసునని రేవంత్ రెడ్డి మండిప్డడారు. దళితులను దగా చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ఈ ఉదంతంలో మాజీ ఎంపీ సంతోష్ రావు, అతని తండ్రిల పాత్రపై సీఐడీ విచారణలో నిగ్గు తేల్చాలని కోరుతామన్నారు. మరో ఎంపీకి సంబంధించిన గాయత్రి గ్రానైట్ అవినీతిపై కూడా విచారణ చేస్తామన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు సంబంధించిన శ్వేత గ్రానైట్ ఇన్ లీగల్ మైనింగ్ గుట్టును కూడా విప్పుతామని అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్ఎస్ పాలనలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా చేసిన దాష్టీకాలతో పాటు ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టాన్ని అనాపైసాలతో సహా కక్కిస్తామని, బాధ్యులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.

More articles

Latest article