అవదూత నిర్మలానంద స్వామి భూమికి ఎసరు

0 9,916
  • . . కరోనా కాలం నుంచే కబ్జాకు యత్నాలు
  • . . . పక్కాగా రికార్డులు,  హద్దులు ఉన్నా కబ్జా వైనం
  • . . . సిర్పూర్ లో నాయకత్రయం లీలలు

నిజామాబాద్, బతుకమ్మ : ఆయన ఒక స్వామి. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు నాటి ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. సంబంధిత భూమి శివారు ప్రాంతంలో ఉండడంతో అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సాగు చేసేందుకు ప్రయత్నించారు. అయితే రాళ్ళు, రప్పలతో కూడిన భూమి కావడంతో దానిని కౌలుకు ఇచ్చి ఆయన ఇంటి వద్దనే ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సేవ చేసుకుంటున్నారు. అయితే కొందరు కౌలుదారులు సంబంధిత భూమి పైకి కరోనా కాలంలో స్వామివారు రాకపోవడంతో దానిని కబ్జా చేయాలనే యోచన చేశారు. ముందుగానే స్వామి తన భూమి కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అయినప్పటికీ కౌలుదారులు వినకపోవడంతో స్వామి తనకు ప్రభుత్వం  ఇచ్చిన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని మోపాల్ మండలంలోని ఆనాటి అధికార పార్టీ ప్రముఖ నాయకులను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. స్వామి భూమిని స్వామికి చెందేటట్లు చేస్తామని భరోసా ఇచ్చిన నాయకులు ఆ భూమికి ఎసరు పెడుతారని ఆ స్వామే ఊహించలేకపోయారు. ఎవరైతే కౌలుదారులు భూమిని సాగు చేసారో వారిని నయానో భయానో బెదిరించి నాయకగణం అక్కడ తిష్ట వేశారు.

The messenger Nirmalananda Swami flew to earth

సంబంధిత స్వామి భూమిలో అపారంగా మొరం గుట్ట ఉండడంతో తవ్వేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే సంబంధిత భూమి నుంచి మొరం తరలించి సొమ్ము చేసుకున్నారు. దాదాపు అక్కడ ఏడాది పాటు మొరంను పట్టణానికి తరలించి సొమ్ము చేసుకున్నారు. గుట్టను మొత్తం సఫా చేయడంతో చదును చేసిన భూమిని చూసి కన్నుకుట్టిన నాయకులు ఆ భూమిలో స్వామినే అడుగుపెట్టనీయ్యకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు కావడంతో వారిని ఎవరు ఏమి అనకపోవడంతో స్వామి వారికి సంబంధించిన ఐదు ఎకరాల భూమితో పాటు చుట్టు ప్రక్కల ఉన్న గుట్టలను మొత్తం మింగేశారు. దాదాపు 20 నుంచి 30 ఎకరాల్లో లక్షల రూపాయల విలువైన గ్రానెట్ తో పాటు మొరాన్ని తవ్వి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు అక్కడా 8 ఎకరాల్లో అక్రమంగా సాగు చేసుకుంటూ భూమిని అనుభవిస్తున్నారు. స్వామిని గానీ, ఆయన అనుచరులను కానీ అక్కడికి రాకుండా అడ్డుకుని కబ్జా కొనసాగిస్తున్నారు.

గ్రామానికి చెందిన స్వామికి సంబంధించిన భూమిగా సిర్పూర్ గ్రామంలో ప్రతి  ఒక్కరికి తెలుసు. మోపాల్ మండలంలోని రెండు గ్రామాలకు  చెందిన మాజీ ప్రజాప్రతినిధులు భూమిపై కన్నేసి చెరబట్టారు. సంబంధిత భూమిపై ఇప్పటికి ధరణితో సహా ప్రతి రికార్డుల్లోనూ స్వామి వారి  పేరే  ఉంది. 1984లో ప్రభుత్వం ఇచ్చినట్లు టిఫాన్ పొడు చేసినట్లు రికార్డుల్లోనూ నిక్షిప్తమై ఉంది. ఎక్కడ కూడా రికార్డులు మాత్రం మారలేదు. కానీ చెరబట్టిన వారు అధికార పార్టీ నాయకులు కావడంతో వారి ఆగడాలపై అధికారులు కూడా వారికే వత్తాసు పలికారు. సంబంధిత భూమి విషయంలో ఇది వరకు చాలాసార్లు పంచాయితీలు జరిగిన ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. కబ్జా చేసిన నాయకులే  స్వామిని అక్కడికి రానివ్వకుండా ఎంతో కొంత తీసుకుని వివాదాలను పెద్ద చేయవద్దని సూచించడం గమనార్హం. అనాడు అధికార పార్టీలో ఉన్న లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి కబ్జాపై పట్టుబిగించారు.

The messenger Nirmalananda Swami flew to earth

Leave A Reply

Your email address will not be published.