హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం చరిత్రాత్మకం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత దేశం బ్రిటిష్ వలస పాలకుల నుండి స్వాతంత్ర్యo పొందిన అనంతరం భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్తానం విలీనం కావడం చారిత్రాత్మాకమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి అన్నారు. తెలంగాణ సంస్తానం భారత యూనియన్ లో కలిసిపోయి, నిజామ్ సర్దార్ పటేల్ ముందు లొంగిపోయిన సెప్టెంబర్ 17 పర్వదినం సందర్బంగా జిల్లాకోర్టు చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం ఆయన మాట్లాడారు.హైదరాబాద్ సంస్తానం నిజాం పాలన నుండి భారత్ పాలనలోకి రావడానికి నాటి...