23.7 C
Hyderabad

ప్రాణాలు తీసిన మద్యం కిక్కు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కల్లులో లిక్కర్ కలుపుకొని తాగిన ఇద్దరు వ్యక్తులు

 

. . . ఒకరు మృతి… మరొకరు సీరియస్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

కిక్కు కోసం కల్లులో మద్యం కలిపి సేవించిన వ్యక్తి మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఎడపల్లి మండలం అంబంలో జరిగింది. బోధన్ మెయిన్ రోడ్డు నర్సాపూర్ అక్రమ కల్లు దుకాణం లో అంబం గ్రామానికి చెందిన విట్టల్, లక్షయ్య లు కిక్కు కోసం కల్లులో మద్యం కలిపి సేవించారు. ఇద్దరిలో విఠల్ మృతి చెందగా, లక్ష్మయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మద్యం కలిపిన కల్లు సేవించడమే ఘటనకు కారణమా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

More articles

Latest article