. . . నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కార్గిల్ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని ఆదివారం నగరంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో గల అమరవీరుల స్తూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..1999 లో కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం అసమాన ధైర్యసహసాలను ప్రదర్శించి, శత్రువులను తరిమి కొట్టి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిందన్నారు. సుమారు 500 మంది సైనికులు తమ ప్రాణాలను అర్పించారని వారందరి త్యాగ ఫలితంతో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామన్నారు. వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. బీజేపీ ఎప్పటికీ దేశభద్రత సైనికుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తుందన్నారు. దేశ ప్రధాని మోదీ నేతృత్వంలో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. అమర జవాన్ల త్యాగాన్ని స్మరించుకుంటూ దేశ సమైక్యతను సార్వభౌమత్యాన్ని కాపాడేందుకు అంకితభావంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, మహిళా మోర్చ అధ్యక్షురాలు వనిత, యువ మోర్చా అధ్యక్షులు వంశీ, కార్పొరేటర్లు బెల్లాల్ శశాంక్, మఠం పవన్, జ్యోతి మురళి, సుమిత్ర కిషోర్, ప్రసూన శ్రీనివాస్, మమత శివ, రాష్ట్ర కో కోశాధికారి విజయ్, సీనియర్ నాయకులు స్వామి యాదవ్ భూపతి తదితరులు పాల్గొన్నారు.

