బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని పూలే విగ్రహం వద్ద డిసెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించ తలపెట్టిన హలో మాల..చలో హైదరాబాద్ మాలల సింహగర్జన గోడ ప్రతులను గురువారం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అంగుళీమాల మాట్లాడుతూ మాలల అస్తిత్వము,ఆత్మగౌరవము, ఐక్యత, అభివృద్ధి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని అన్నారు. మోర్తాడ్, బాల్కొండ పరిసర గ్రామాల్లోని మాల యువతకు మేధావులకు వివిధ రాజకీయ పార్టీల మాల నాయకులకు కుల సంఘాల పెద్దలకు మహిళలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామం నుండి ఇంటికో మనిషి వూరికో వాహనంతో వేలాదిగా మాలల అభివృద్ధికి ప్రతి మాలబిడ్డ పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తరలివచ్చి మాలల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సందీప్ కుమార్, మహేష్, కవిరాజు తదితరులు పాల్గొన్నారు.
