. . . ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన నూతన గృహానికి ఆదివారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటిలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చైర్మన్, గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గృహప్రవేశం సందర్భంగా కుటుంబ సభ్యులు మున్సిపల్ చైర్మన్‌కు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం నూతన గృహాన్ని పరిశీలించిన చైర్మన్, కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, 11వ వార్డు కౌన్సిలర్ గద్దె తిరుపతి, రఫిక్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, మున్సిపాలిటీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

