29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

భర్త అనుమానమే నిజమైంది

Must read

📰 Generate e-Paper Clip

  • కన్న కూతురిని చంపిన కసాయి తల్లి
  • పారిపోతుండగా పట్టుకొన్న పోలీసులు

 

భీమ్ గల్, బతుకమ్మ : నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లే అభంశుభం తెలియని ఐదునెల్ల తన కూతుర్ని కాడతేర్చిన ఘటన మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో విశాధాన్ని నింపింది. తన భర్త తన కూతుర్ని పట్టించుకోవడం లేదని, మందలించిడన్న కోపంతో తాగిన మైకంలో కన్నకూతురు అని చూడకుండా ఐదునెల్ల పసికందును  ఆ కసాయి తల్లి చిదిమివేసింది. భీమ్ గల్ సీ.ఐ సత్యనారయణ గౌడ్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోనుగొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్ తన భార్య సిరసు రమ్య తాగుడికి అలవాటై తన ఐదునెలల కూతురు శివానిని పట్టించుకోవడం లేదని ఈ నెల 7 న మందలించి రోజువారి పనుల్లో భాగంగా బయటకు వెళ్ళాడు. తన కూతురు శివాని కారణంగా తన భర్త మందలించడని క్షణికావేశంలో చిన్నారి శివానిపై దుప్పటి కప్పి అధిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపివేసింది. నిందితురాలి భర్త నా కూతుర్ని నా భార్యే చంపేసిందని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం నిందితురాలు పారిపోతుండగా భీమ్ గల్ ప్రభుత్వ  ఆసుపత్రి వద్ద పట్టుకున్నారు. నిందితురాలిని విచారించగా తానే చంపినట్లు నేరం అంగీకరించింది. దాంతో నిందితురాలు రమ్యను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. అనంతరం ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా నిందుతురాలిని జైల్ కు పంపినట్లు సీ. ఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

More articles

Latest article