26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కేంద్ర పథకాల సమాహారమే రచ్చబండ

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల సమహరమే ఈ రచ్చబండ కార్యక్రమమని మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ అన్నారు. ఆదివారం మండలంలోని పోచంపల్లి గ్రామంలో  మండల బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను  ప్రజలకు వివరించేందుకేనని అన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తెలుసుకొని ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయక ఇబ్బంది పెడుతున్నారని ఆరు గ్యారెంటీలు ప్రజలను మోసం చేసే గ్యారెంటీలని ఆయన ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మోసాలను గుర్తించాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఇస్తానన్న రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, రైతు పెట్టుబడి సహాయం పోయిన వేసంగి, అంతకుముందు వర్షాకాలం ఇవ్వలేదని ,కొత్త పెన్షన్ల విషయంలో ఇప్పటికి ఊసేలేదన్నారు.వృద్ధాప్య పెన్షన్ రూ.4000 చేస్తామని ఇప్పటికీ అమలు చేయలేదని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదని,కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని ఇవ్వలేదని, గ్యాస్ సిలిండర్ రూ.500 సబ్సిడీ ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని నవీన్ కోరారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి భానుచందర్, పోచంపల్లి శేఖర్,మోహన్,ముత్యం రాజు, బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article