27.5 C
Hyderabad
Friday, July 31, 2026

వైద్య చికిత్సల భారాన్ని తగ్గంచడమే ప్రభుత్వ లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

నాగి రెడ్డి పేట్, బతుకమ్మ :

 

పేద ప్రజలకు వైద్య చికిత్సల భారాన్ని తగ్గించి వారికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విస్తృతంగా సహాయం అందిస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. గురువారం అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. నాగిరెడ్డిపేట మండలం మల్తుమేధ గ్రామానికి చెందిన దిగంబర్ శర్మ కి రూ.1.54 లక్షలు, ఆత్మకూర్ గ్రామానికి చెందిన కవిత శ్రీనివాస్ కి రూ.1.54 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకాన్ని చేరవేయడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల కష్టకాలంలో అండగా నిలుస్తూ సంక్షేమ పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article