నాణ్యమైన రహదారుల నిర్మాణమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

0 14,643
  • ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

 

జుక్కల్, బతుకమ్మ : నాణ్యమైన రహదారుల నిర్మాణమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై అధికారులతో చర్చించారు. దుస్థితిలో ఉన్న రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖలో పనులు వేగవంతం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.