28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రెడ్డి సంఘాల పోరాట ఫలితమే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

  • సీఎం అడవైజర్ వేం నరేందర్ రెడ్డితో సంఘ ప్రతినిధుల చర్చలు
  • రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ఎం అడవైజర్ వేం నరేందర్ రెడ్డితో సంఘ ప్రతినిధుల చర్చలు
  • రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో పేద రెడ్డి సామాజిక వర్గం కోసం జరుగుతున్న పోరాటం,  ఉద్యమ ఫలితమే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పేద రెడ్ల కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగునుందని రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సీ. ఎం అడ్వాయజర్ వేం నరేందర్ రెడ్డి తో రెడ్డి సంఘాల భేటీ, చర్చలు జరిగాయన్నారు. ఆ చర్చల్లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు అనుకూలంగా మాట ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు జానా రెడ్డి,సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిలకు పలు మార్లు విన్నవించడం జరిగిందన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చాలామంది పేదరికంలో ఉన్నారని,  ఆయా వర్గాలకు ప్రభుత్వం నుండి కావచ్చు, వారికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఆ వర్గాలకు చెందిన పేదలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు.  కానీ ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు అగ్రవర్ణాల పేదలకు ఎటువంటి సహయ సహకారాలు అందించలేదని, రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో పేద రెడ్ల కోసం చాలా నిరసన కార్యక్రమాలు,  బహిరంగ సభలు,  ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు చేయడం జరిగిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద రెడ్ల కు ప్రభుత్వం నుండి ప్రతిఫలాలు అందాలని మేము చాలా సార్లు విన్నవించడం జరిగిందని,  తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నేపథ్యం లో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే చట్టబద్ధతతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద రెడ్డి సామాజిక వర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు దీని ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా స్థిరపడే విధంగా కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించబడతాయని కరుణాకర్ రెడ్డి వివరించారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తొందరలోనే  కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పేద వర్గాల యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి, సీ. ఎం కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక స్టేట్ ప్రెసిడెంట్ ఏనుగు సంతోష్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ ఎలిమినేటి సుమన్ రెడ్డి, జేఏసీ చైర్మన్ బద్రు వెంకటేశ్వరరెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపి జైపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సంజీవరెడ్డి రాజ్ కుమార్ రెడ్డి,  దయాకర్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

The formation of the Reddy Corporation is the result of the struggle of the Reddy associations.

More articles

Latest article